15, ఏప్రిల్ 2012, ఆదివారం

ఇల్లు కొంటున్నారా, కొనేముందు జాగ్రత్తలు

Source:http://syedrafiq.blogspot.in/2011/04/blog-post_10.html

సామాన్యుడికి సొంతిల్లు, సొంత ప్లాటు ఓ అందమైన కల. జీవితంలో ఎన్నో సంవత్సరాలు చమటోడ్చి కూడబెట్టిన డబ్బుతో  ఆ కలను సాకా రం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. శక్తికిమించిన కోరికైనా శక్తిమేరకు ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో ఎన్నో విషయాలను తెలుసుకోవాలి. నిర్మాణ రంగంలోని లొసుగులు,  స్థలానికి చెందిన లావాదే వీలు, అక్రమనిర్మాణాలు, అబద్దపు లేఅవ్ఞట్‌లు, దర్జాను వెలగబోస్తున్న దళారీలు, వేలాలు, ప్రత్యా మ్నయ ఆఫర్‌లు, జిగేల్‌మనిపించే లక్కీ స్కీంల ఆకర్షణలు వీటన్నింటి మధ్య దిక్కుతోచకుండా నిలబడతాడు వినియోగదారుడు. ఆచితూచి అడుగు వేయాలంటే కాసింత అవగాహన అవసరం మరి.ఇల్లుకొనేముందు మీరు వీటిని ఖచ్చితంగా తెలుసు కోవాలి. లేకపోతే మీరు అమితంగా నష్టపోవాల్సి వస్తుంది
1.ఫ్లాట్‌ బుక్‌ చేసేటప్పుడు మీరు బిల్డర్‌ నేప థ్యాన్ని, అతని గత పనితీరుని గురించి వెరిఫై చేయాలి. ఫ్లాట్‌/ప్లాటు ఎటువంటి అక్రమణలు, లిటిగేషన్లకు గురికాలేదని కూడా నిర్ధారించు కోవాలి.బిల్డర్‌ మున్సిపల్‌, ఇతర ఆథారిటీల నుండి అవసరమైన క్లియరెన్సులు, అనుమతులు అన్నీ పొందాడనికి, లే అవుట్‌ అనుమతించబడిందని నిర్ధారించుకోవాలి.
2.నిర్మాణం/అభివృద్ధి జరిగే చోటును రెగ్యులర్‌గా సందర్శిస్తూ ఆయా తేదీలలో వాటికి తగిన డాక్యుమెంటేషన్‌, ఫోటోగ్రాఫ్‌లను రుజువుగా ఉంచుకోవాలి. బిల్డర్‌కు మీకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఒక ఫైలులో పెట్టాలి.
అంగీకారం కుదుర్చుకోవడానికి ముందుగానే బిల్డర్‌ చేసిన అడ్వర్‌టైజ్‌మెంట్లు, వాగ్దానాలను చర్చించాలి. వాగ్దానాలన్నీ అంగీకారంలో సరిగ్గా చేరేటట్లు చూడాలి.బిల్డర్‌తో అంగీకారం కుదుర్చుకునేటప్పుడు, పొసెషన్‌ ఇచ్చేకాల వ్యవధి పరస్పరం అంగీక రించినట్లుగా పేర్కొనబడిందా అనేది నిర్ధారించు కోవాలి. భవనం వివిధ దశలకు సంబంధించిన కాల వ్యవధులను అంగీకారంలో చేరేటట్లు చూడాలి.
3.నిర్మాణంలో దశల ఆధారంగా వాయిదాలు చెల్లించవలసి ఉంటే, ఇరుపక్షాలలో ఎవరైనా ఆలస్యం చేస్తే తలెత్తే పరణామాల గురించి చర్చించి, అంగీకారానికి రావాలి.చెల్లింపు షరతులను మీరు స్పష్టంగా పేర్కొనాలి. అవసరమైతే పార్కింగ్‌ స్పేస్‌ వినియోగం గురించికూడా తెలుసుకోవాలి.కార్పెట్‌ ఏరియా, బిల్డప్‌ ఏరియా, సూపర్‌ బిల్డప్‌ ఏరియా మొదలైన అంశాలకు అర్ధం బిల్డర్‌ను, రాష్ట్రాన్నిబట్టి మారుతుంటాయి. సమయానుసారంగా కూడా వీటిలో మార్పులొ స్తాయి. వాటిని క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. అంగీకారంపై సంతకం చేసే ముందు వాటిని స్పష్టంగా వెల్లడించి అంగీకారంలో చేర్చాలి. నిర్మాణం, ఫిక్సర్లు, ఫిట్టింగుల నాణ్యతను కూడా అగ్రిమెంటు స్పష్టం చేయాలి.
4.బిల్డరు చర్యలవల్ల అనేకమంది కొనుగోలుదా రులు నష్టపోయినట్లయితే సముదాయంగా, సొసైటీగా ఒకే ఫిర్యాదును దాకలు చేసే విషయాన్ని పరిశీలించండి. నష్టం ఒక కోటి  రూపాయలు దాటితే, జాతీయ కమిషన్‌ ఎదుట 20లక్షల నుండి ఒక కోటి రూపాయల మధ్య ఉంటే, రాష్ట్ర కమిషన్‌ ఎదుట 20 లక్షల తక్కువ ఉంటే ఫోరంలో ఫిర్యాదు చేయాలి.
మీ చిరునామా మార్పును లిఖిత పూర్వకంగా బిల్డర్‌కు తెలపండి.ఫిర్యాదు దాఖలు చేసేటప్పుడు గుర్తుంచుకో వలసిన అతిముఖ్యమైన అంశం పరిమితి. చర్య జరిగిన 2 సంవత్సరాలలోపు మీరు ఫిర్యాదు దాఖలు చేయాలి. ఈ పరిమితి ఉండడం వల్ల మీ లేఖలు బిల్డర్‌ జవాబు ఇవ్వడని తెలిసి కూడా ఎదురుచూస్తూ కూర్చోవడం, అంగీక రించినట్లుగా నిర్మాణం పూర్తయ్యేంత వరకు ఎదురుచూడటం వల్ల మీ కేసుకు ప్రయోజనం ఉండదు.సహకార సంఘాల సభ్యులు వినియోగదారుల రక్షణ చట్టం కింద ఉపశమనం క్లెయిం చేసుకో వచ్చు. కారు పార్కింగ్‌ రోడ్లు, నీరు, విద్యుత్తు, ఇతర సదుపాయాలను కల్పిస్తామనే హామీ ఒప్పందంలో పేర్కొన్నప్పటికీ పొసెషన్‌ సమయం లో వాటిని కల్పించని అనేక కేసుల్లో హౌజింగ్‌ సొసైటీల ఉపశమనం అందించడం జరిగింది.
5.ఇంటిని కొనే ముందు డాక్యుమెంట్ల పరిశీలన:ఎప్పుడైనా ఒక భూమిని లేదా ఇం టిని కొనుగోలు చేసే ముందు అం దుకు సంబంధించిన క్రయ, వి క్రయాల ఒప్పందాలను రెండుమార్లు తనిఖీలు చేసుకోవాల్సిన అవసర ముంది. రియల్‌ ఎస్టేట్‌లో కూడా న కిలీ యాజమాన్యాలు నేడు అధి కమవుతున్నాయి. కొందరు వ్యక్తులు అప్పటికే వేరే వారికి అమ్మిన స్థ లాలను మళ్లీ ఇతరులకు అమ్మేం దుకు ప్రయత్నిస్తుంటారు. అలాగే ఫ్లాట్లు, ప్ల్లాట్ల విషయంలో కూడా ఇటువంటివి అనేకం జరుగుతు న్నాయి. ఇటువంటి రియల్‌ ఎస్టేట్‌ మోసగాళ్లు అప్పటికే మార్టిగేజ్‌ అ యిన భూములనే మళ్లీ విక్రయి స్తుంటారు.ఆ విధంగా అమ్మేసిన తర్వాత సీన్‌ నుంచి తప్పుకుని పరారయ్యే పరిస్థితులు ఉన్నాయి. భాగ్యనగర పరిధిలో ఆస్తుల మో సాలు నానాటికీ అధికమవుతున్నా యి. దీనికి కారణం భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడమే. కొన్ని సందర్భాల్లో భూమి క్రయ, విక్ర యాలకు సంబంధించి ' బూమ్‌ లే కపోయినప్పటికీ, స్థలాల రేట్లు ఎ క్కువగానే ఉంటున్నాయి. అందువల్ల తక్కువ ధరలకు భూములను కొనుగోలు చేసి, ఆ తర్వాత వాటిని ఎక్కువ ధరకు విక్రయించేందుకు కొంతమంది సిద్ధమవుతున్నారు. ఈ దశలోనే అసలు బండారం బయట పడుతుంది. ఒరిజనల్‌ భూములకు సంబంధించిన పత్రాలలో గోల్‌మాల్‌ జరిగిందని తెలుస్తుంది.
అయితే ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో దాదా పు అయిదు వందలకు పైగా ఆస్తుల మోసాలకు సంబంధించి కేసులు నమోదు అవుతున్నాయని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. హైదరా బాద్‌ నగర శివారుల్లోని కొండాపూర్‌, మాదాపూర్‌, దిండిగల్‌, ఘట్‌కేసర్‌, శంషాబాద్‌, శామీర్‌పేట, చౌటుప్ప ల్‌, పటాన్‌చెరు తదితర ప్రాంతాల్లో ప్రాఫర్టీ మోసం కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. ఈ ఏరి యాల్లో డాక్యుమెంట్లను తారుమారు చేసి భూములను విక్రయిస్తున్నట్లు వెల్లడవుతోంది.
6.కొన్ని సందర్భాల్లో ప్రవాస భారతీయులు వేరే దేశంలో ఉంటారు. వారు ఇక్కడ తమ భూ ముల స్థితిగతుల గురించి ఎక్కువగా పట్టించుకునే పరిస్థితులు ఉండవు. అటువంటి సందర్భాల్లో కొందరు దళారీ వ్యాపారులు ఎన్‌ఆర్‌ఐలకు తెలియకుండా వారి భూములను నకిలీ డాక్యుమెంట్లతో అమ్మేస్తున్నా రు. డబ్బు ఉత్తిపుణ్యాన నష్టపోతే ఎవరైనా బాధ పడాల్సిందే. మళ్లీ డబ్బు సంపాదించుకోవాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది.అందు వల్ల భూములు, స్థలాలు, ఫ్లాట్లు కొనుగోలు చేసే సమయంలో అసలు ఆ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసు కోవాలి. అత్యవసర పరిస్థితిలో న్యా యనిపుణుల సలహాలను స్వీకరిం చాలి. అంతేగాక భూముల కొనుగోలు దారులు ప్రాఫర్టీ మోసాలకు చిక్కుకోకుండా తగిన జాగ్రత్తలు తీసు కోవాలి.
 7.పొదుపు చేసి గృహాలు కొను కో్కవడం.. : బ్యాంకు వడ్డీలతో కాకుండా ఉద్యోగాల్లో చేరిన తర్వాత చాలా మంది పోస్టు రిటైర్మెంట్‌ స్కీం లో పొదుపు చేస్తుంటారు. ఇవి ఎంత తొందరగా మొదలుపెడితే అంత మంచిది. ఇన్సురెన్సు, పెన్షన్‌ స్కీంలు చాలా చౌక. దీని మీద రాబడి మాత్రం ఎక్కువగానే వస్తుందని చెప్పాలి. ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో ఈ స్కీంల లో చేరిన వారి ఇవి చక్కగా పనికి వస్తాయి. ఇవే స్కీంలు మధ్య వయస్సు లో ప్రారంభిస్తే పెద్ద మొత్తంలో ప్రీమియంలు చెల్లిం చాల్సి వస్తుంది. ఇన్సురెన్సు, పెన్షన్‌ స్కీంల ద్వారా రుణాలు పొందాలి... దానితో పాటు అదనంగా కొన్ని పొదుపు చేసిన సొమ్ము జతైతే ఈఎంఐలు పెద్ద ఎత్తున చెల్లించాల్సిన బాధ ఉండదు. దానితో పాటు లోన్‌ అవుట్‌స్టాం డింగ్‌ అనేది తగ్గుకుంటూ వస్తుంది. మీరు రుణం చెల్లింపు వాయిదాలు కూడా తొందర గా తీరిపోతాయి. తర్వాత మీరు రుణ విముక్తులయ్యారు కాబట్టి భవిష్యత్తు గురించి చక్కటి ప్లానింగ్‌కు తీరిక అవాకశం కూడా దొరుకుతంది.
8.ఇంటి ధర : ఈ నేపథ్యంలో రోజు రోజుకు ముడిపదా ర్థాల రేటు పెరగడంతో పాటు ఇంటి ధరలు కూడాచుక్కలనంటుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడితేనష్టం వచ్చే అవకాశం లేకపోయినా.. గతంలో ఇంటి ధరల్లో కరెక్షను వచ్చిన సంఘనలు కూడా ఉన్నా యి. డిమాండ్‌ సప్లయ్‌ సూత్రం ఆధారంగా మ ళ్లీ ధరలు పెరిగాయి. మన పట్టణాలు, నగరాల్లో రోజు రోజుకు జనాభా పెరుగుతూపోతోంది కాబట్టి రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబ డులకు ఢోకా మాత్రం లేదనే చెప్పాలి. అందకే .. వీలైనంత తొందరగా ఇళ్లు కొనుగోలు చేసి.. చెల్లింపులు కూడా త్వరగా ముగుస్తాయి.

9.పదవీ విరమణ తర్వాత ప్రశాంతంగా జీవింవచ్చు. మన పెట్టుబడులకు తగ్గ విలువ దక్కాలంటే.. నగరం చుట్టు పక్కల ఎక్కడైనా త్వరగా అభివృద్ధి చెందుతుందనే అవకాశం ఉంటే ఆలస్యం చేయకుండా పెట్టుబడులు పెట్టడం మంచిది. అదే ప్రాంతంలో వాణిజ్య సముదాయాలు లాంటి ప్రాజెక్టులు వస్తే ... మీరు కొనుగోలు చేసిన ఆస్తికి మంచి విలువ ఉంటుంది. తర్వాత ఆ ఆస్తిని విక్రయించి సొమ్ము చేసుకుని లాభం గడించి కొత్త ప్రాంతానికి వెళ్లి మరో ఆస్తిని కొనుగోలు చేసుకోవచ్చు. భవిష్యత్తులో భారత్‌లో కూడా పశ్చిమ దేశాల మాదిరిగా రివర్స్‌ మార్టిగేజ్‌ కాన్సెప్ట్‌ వచ్చే అవకాశం ఉంది. అందుకే జీవితం లో వీలైనంత తొందరగా ఇల్లు కొను గోలు చేసి మంచి లాభాలు గడిం చే ఆస్కారా న్ని చేజార్చుకో రాదని రియల్‌ ఎస్టేట్‌ ని పుణులు సలహా ఇస్తున్నారు.

 Source: http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=35215&Categoryid=1&subcatid=3

దొంగలు ఎత్తుకుపోతారన్న దిగులక్కర్లేదు.. హఠాత్తుగా విలువ తగ్గుతుందన్న ఆందోళన అవసరం లేదు.. ఎప్పటికైనా విలువ పెరుగుతుందే తప్ప తగ్గనే తగ్గదు..
ఇలాంటి సానుకూలాంశాల కారణంగా చాలామంది రియల్టీ రంగంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు. స్థలాలు, ఫ్లాట్లు, వాణిజ్య స్థలాల్ని కొనడానికి ముందుకొస్తారు. లాభాలే కాదు.. మోసాలకు, వివాదాలకూ ఈ రంగం పెట్టింది పేరని తెలిసిందే! కాబట్టి స్థిరాస్తులు కొనేముందు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.

స్థలం కొంటున్నారా?
భూముల ధరలు అనూహ్యంగా పెరగడంతో ఎక్కువ మంది స్థలాలు కొనలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎగువ మధ్యతరగతి ప్రజలు మాత్రం రుణాలు తీసుకుని చిన్నచిన్న ఫ్లాట్లు, వారాంతపు ఇళ్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఏం చేయాలి?
ట మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతంలోనే స్థలాలు కొనుగోలు చేయండి.
ట మీరు కొనబోయే స్థలాన్ని ఎవరైనా లీజుకు తీసుకున్నారా? ఖాళీగా ఉందా? అన్నది చూడాలి. ఆ స్థలం వ్యవసాయ భూమా, వ్యవసాయేతర భూమా? ఆ భూమిపై చెల్లించాల్సిన రుసుములేమైనా ఉన్నాయా వంటి వివరాలు చూసుకోవాలి. ఒకవేళ మీరు రైతుగా భూమిని కొనుగోలు చేస్తుంటే.. మీరు వ్యవసాయ రంగంలో ఉన్నారని నిర్ధారించే పత్రాల్ని చూపించాల్సి ఉంటుంది.

ఏం చేయకూడదు?
ట తక్కువ ధరకు వస్తుందని చెప్పి ఎక్కడో ఓ చోట కొనడానికి ప్రయత్నించొద్దు. మీరు కొనబోయే స్థలానికి రవాణా సౌకర్యం, అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చూసుకోండి. అలాంటి వాటినే భవిష్యత్తులో మంచి ధరకు అమ్ముకోవచ్చు.

సొంతిల్లా?
ఇప్పటికే సొంతిల్లు ఉండి.. రెండో ఇంటిపై పెట్టుబడి పెట్టే వారు అద్దెల ద్వారా ఆదాయం కోసం, లేదంటే మంచి ధర పలికినప్పుడు అధిక రేటుకు అమ్ముకోవడానికి ప్రాధాన్యమిస్తారు. వీటి విలువ వాణిజ్య భవనాల కంటే తక్కువగా ఉండటం, గృహ రుణాలపై పన్ను మినహాయింపు వంటి అదనపు ఆర్థిక ప్రయోజనాలుంటాయి.

ఏం చేయాలి?
ట మార్కెట్లో బిల్డర్‌కు ఎలాంటి పేరుందో ఆరా తీయాలి. బిల్డర్ చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ ప్రాంతంలో ఉంది? అన్న విషయాలను బట్టే మీరు కొనబోయే ఇంటి విలువ ఎంతమేరకు పెరుగుతుందనేది ఆధారపడి ఉంటంది. వీటితో పాటూ భవన ప్రణాళిక, అనుమతులు, యాజమాన్య హక్కు వంటి అంశాల్ని నిశితంగా పరిశీలించాలి.

ట ఫ్లాట్/ఇల్లు నివాసానికి సిద్ధంగా ఉన్నవి, లేదంటే నిర్మాణం పూర్తి కావచ్చినవి కొనడం వల్ల రాబడిని త్వరగా అందుకోవచ్చు. ఇలాంటి ఇళ్లను కొంటే.. వెంటనే అద్దెకిచ్చి ఆదాయం పొందవచ్చు.

ట అభివృద్ధికి ఆస్కారం గల ప్రాంతంలో నిర్మాణం చివరి దశలో ఉన్న ఇంటిని కొంటే రెండిందాల లాభం. ప్రాజెక్టు పూర్తి కాగానే నెలానెలా అద్దె పొందొచ్చు. ఇంటి విలువ వేగంగా పెరుగుతుంది.

ట దాచుకున్న సొమ్ముతో ఇల్లు కొంటే నెలవారీ వాయిదాల భారం లేకుండా చూసుకోవచ్చు.
ఏం చేయకూడదు?
పేపర్ వర్క్ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. సాధ్యమైనంత వరకు మీరు కొనబోయే ఇంటికి సంబంధించిన పూర్తి వివరాల్ని తెలుసుకోండి.

వాణిజ్య భవనాల్లో..
అద్దెల రూపంలో మంచి ఆదాయం ఆశించే వారికి నివాస భవనాలతో పోలిస్తే వాణిజ్య భవనాలే చక్కటి ప్రత్యామ్నాయం. మంచి వాణిజ్య ప్రాంతంలో కమర్షియల్ స్పేస్‌కు ఉండే గిరాకీ అంతాఇంతా కాదు.

ఏం చేయాలి?
నగరాల్లోని ప్రధాన ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలైన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలి.
మీరు కమర్షియల్ స్పేస్ కొనుగోలు చేసే ప్రాజెక్టు(భవనం)లో ఎలాంటి కార్యాలయాలు ఏర్పాటవుతాయో తెలుసుకోండి. దీన్ని బట్టి మీ స్థలాన్ని విలువెంత పెరుగుతుందనే విషయం ఆధారపడి ఉంటుంది.
ట కొనుగోలు చేయడానికి ముందే లీజ్‌లో ఉన్న షాపులు/కమర్షియల్ స్పేస్‌లో పెట్టుబడి పెడితే నెలనెలా స్థిరాదాయం లభిస్తుంది. ఇలాంటి వాటిలో పెట్టుబడి వల్ల క్రమంగా ఆదాయం రావడంతో పాటూ ఆస్తి విలువ పెరుగుతుంది.
మరొకరితో కలిసి పెట్టుబడి పెట్టాలనుకుంటే... భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోండి. దీని వల్ల ఖర్చుల్లో భాగం పంచుకోవడంతో పాటు, మీ పెట్టుబడికి రక్షణగా ఉంటుంది.
ఏం చేయకూడదు?
అభివృద్ధి చెందని ప్రాంతంలో కమర్షియల్ స్పేస్ కొనకపోవడమే ఉత్తమం.
చౌకగా వస్తుందని తొందరపడి పెట్టుబడి పెట్టొద్దు. నిర్మాణ నాణ్యత, కమర్షియల్ స్పేస్ లేఅవుట్‌ను పరిశీలించడం ఎంతో ముఖ్యం.
సొమ్ము చేతిలో లేకపోయినా కొనడం తెలివైన మదుపరుల లక్షణం కాదు. కమర్షియల్ స్పేస్‌పై పెట్టే పెట్టుబడిపై పన్నురాయితీలు ఉండవని గుర్తుంచుకోండి. రుణాలపై వడ్డీ రేట్లు కూడా అధికమేనన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. వీటిపై వడ్డీ సుమారుగా 15-16 శాతం వరకు ఉండొచ్చు. 

http://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%AD%E0%B1%82%E0%B0%AE%E0%B0%BF

ref: http://krishkoney.blogspot.in/2011/06/blog-post_18.html

“X¾A Æ¢¬ÇEo ¹~׺o¢’à X¾J-Q-L¢-X¾-èä-§ŒÕ¢œË. ¦Çu¢Â¹× లోన్ ఇస్తుంది  Â¹ŸÄ Æ¢Åà X¾ÂÈ’à …¢{Õ¢-Ÿ¿¯ä ÆA-N-¬Çy®¾¢ X¾EÂË ªÃŸ¿Õ. ÂæšËd OÕ èÇ“’¹-ÅŒh©ð OÕª½Õ …¢œÄ-Lq¢Ÿä! ‚§ŒÖ ƒ¢šËÂË ®¾¢¦¢-Cµ¢-*Ê X¾“ÅÃ-©Fo ¹~׺o¢’à ’¹«ÕE¢ÍÃL. ¹F®¾¢ «áåXjp \@ÁxÂ¹× ®¾J-X¾œÄ N«-ªÃLo Åç©Õ-®¾Õ-ÂË. ®¾n© §ŒÕ•-«Ö-ÊÕ-©ã-«ª½Õ? ‚§ŒÖ ®¾n©¢ ‡Eo ÍäÅŒÕ-©ðxÂË «ÖJ¢C? ˜ãjšË-©ü©ð ®¾«Õ-®¾u-©Õ-¯Ão§ŒÖ? ƒ©Ç¢šË Æ¢¬ÇLo ¹~׺o¢’à X¾J-Q-L¢-ÍÃL. «áEq-X¾©ü JÂê½Õf©Õ, ‚®Ïh X¾ÊÕo, NŸ¿ÕuÅŒÕh, «Õ¢*-Fª½Õ G©Õx©Õ «¢šËN X¾ÂÈ’à …¯Ão§ŒÖ.. ®¾Ÿ¿ª½Õ ƒ¢šË §ŒÕ•-«Ö-EÂË N“¹-ªá¢Íä £¾Ç¹׈ ¯Ãu§ŒÕ-X¾-ª½¢’à ®¾¢“¹-NÕ¢-*¢ŸÄ? ÅŒC-ÅŒª½ Æ¢¬ÇLo ͌֜ÄL.


మీరు కొనే ప్లాటు దేని పరిధిలోకి వస్తుందో తెలుసుకోండి. ఆయా లేఅవుట్‌కి ఎవర్నుంచి అనుమతి ఉందో కనుక్కోండి. పాత లేఅవుట్లకు ఎంసీహెచ్‌, హుడా, డీటీసీపీలు అనుమతిచ్చేవి. సరికొత్త వెంచర్‌ అయితే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీల నుంచి అనుమతి తప్పనిసరి. స్థానిక సంస్థల ఆమోదం లేని వెంచర్‌లో అంటే అనధికార లేఅవుట్‌లో ప్లాటును కొంటే వెంటనే క్రమబద్ధీకరించుకోవాలి.


పాత ఎంసీహెచ్‌, హుడాలో నమోదు కానీ గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ప్లాటు అని తెలిసి కొంటున్నా.. ఆయా లేఅవుట్‌ని క్రమబద్ధీకరిస్తారా లేదా అన్నది ముందుగానే విచారించండి. రోడ్డు వెడల్పు చేయడంలో స్థలాన్ని కోల్పోవాల్సి వస్తుందా అనేదీ ముఖ్యమే! ఉదాహరణకు ఎల్‌ఆర్‌ఎస్‌లో ఏదైనా ప్లాటుకు సంబంధించి పాతిక అడుగుల రోడ్డుంటే.. ఆ ప్లాటులో రహదారి ఉన్న వైపు  2.5 అడుగుల వెడల్పులో స్థలాన్ని రోడ్డు విస్తరణలో కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి విషయాలపై క్షుణ్నంగా అవగాహనకు రండి.


మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం మీరు కొనే ప్లాటు దెబ్బతినే అవకాశముందో లేదో చూసుకోవాలి. అక్రమ లేఅవుట్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తును ఆమోదిస్తున్నా.. బృహత్‌ ప్రణాళికలో నివాస జోన్‌లో లేకపోతే.. క్రమబద్ధీకరణకు అధిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది.


అక్రమ లేఅవుట్‌లో ప్లాటును రెగ్యులరైజ్‌ చేస్తున్నప్పటికీ.. సంబంధిత అధికారులు ఆ లేఅవుట్‌లో ఉండాల్సిన పది శాతం ఖాళీ స్థలం (ఓపెన్‌ స్పేస్‌) ఎంత తక్కువుంటే అంత నిష్పత్తిలో మార్కెట్‌ విలువ ప్రకారం కొనుగోలుదారులు రుసుమును భరించాల్సి ఉంటుంది.


అక్రమ లేఅవుట్లలో కొనే ముందు ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా ప్లాటు రెగ్యులరైజేషన్‌ చేసుకునే వీలుంటే.. అమ్మేవారి ద్వారానే ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకోవడం వల్ల రుసుము తగ్గే అవకాశముంది.


స్థల స్వభావం, స్థల ఆకారంపై భవన నిర్మాణ ఖర్చు కొంత ఆధారపడి ఉంటుంది. ఒండ్రు, నల్లరేగడి, పల్లంలో ఉన్నవి, ఎత్త్తెన బండరాళ్లు ఉన్న భూమి, నాలాలు, చెరువులు, నదులు పక్కనుండే స్థలాల్లో ఇంటిని కడితే.. నిర్మాణ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎర్రమట్టి, మొరం, చదనుగా ఉన్న స్థలాల్లో ఖర్చు కొంత తక్కువౌతుందని గుర్తుంచుకోండి.


విస్తీర్ణం అధికంగా ఉన్న రోడ్డు మీద చిన్న ప్లాటు కొంటే.. నిర్మాణంలో రోడ్డువైపు సెట్‌బ్యాకు ఎక్కువగా వదలాల్సి వస్తుంది. దీంతో ఇంటి సైజు గణనీయంగా తగ్గే అవకాశముంటుంది.


ప్లాటు ఆకారాన్ని బట్టి ఇంటి విస్తీర్ణం ఆధారపడుతుంది. దీర్ఘచతుస్రాకారంలలో 1 : 1.5 నిష్పత్తిలో పొడవు, వెడల్పు ఉన్న ప్లాటులో భవనం చక్కగా వస్తుంది.


నాలాలు, చెరువులు, నదులకు సమీపంలో ఉన్న ప్లాట్లు కొనేముందు..ప్రభుత్వ జీవో ప్రకారం.. నిర్థారిత బఫర్‌ జోన్‌ పరిధిలోకి ఈ ప్లాటు వస్తుందా లేదా అన్నది సరి చూసుకోవడం అన్నివిధాల శ్రేయస్కరం.


*  ప్లాటు కొనేవారెవ్వరైనా.. న్యాయవాది సలహా తీసుకున్నాకే ముందడుగు వేయాలన్న విషయాన్ని మర్చిపోవద్దు.


న్యాయ నిపుణులు ఆస్తికి సంబంధించిన పూర్తి వివరాల నివేదికను అమ్మకందారుడ్ని అడగవ చ్చు. ఆ నివేదిక ఆస్బి చరిత్రను తెలియజేస్తుంది. ఎవరు అసలు యజమానులో, వారి నుంచి ఎవరికి ఎఆ ఏకాలంలో బదిలీ అయిందో ప్రస్తుత యజమాని ఎవరో ఇవన్నీ ఆస్తి చరిత్ర వెల్లడిస్తుంది. ఆస్తిపై రుణాలు తెచ్చినట్టు దాఖలాలున్నా తెలుస్తుంది. ఆస్తిపై రుణాలు తెచ్చినట్లు దాఖలాలున్నా తెలుస్తుం ది. ఆ రుణాలు పూర్తిగా చెల్లించేశారా ఇంకా కొంత బాకీ ఉన్నారా అన్న విషయాలు తెలుస్తాయి.


ఆస్తి టైటిల్‌ను కూడా పరిశీలించవచ్చు. అమ్మకందారుడు ఆ టైటిల్‌ కాపీని ప్రస్తుత అగ్రిమెంట్‌ కాపీతో జత చేస్తే చాలా మంచిది. టైటిల్‌లో న్యాయపరమైన చిక్కులు, రుణ సమస్యలు, ఉంటే అవన్నీ ప్రస్తుత కొనుగోలుదారులు భరించ వలసివస్తుంది. గహ రుణం కోసం ప్రయత్నించేటప్పుడు టైటిల్‌ స్పష్టం గా ఉండాలి. మార్కెట్‌లో దానికి విలువ ఉండాలి. టైటిల్‌ ఆ విధంగా ఎలాంటి చిక్కులు లేకుండా క్లియర్‌గా ఉంటే అమ్మకందారుడు నిజమైన యజమాని అని గుండె మీద చెయ్యి వేసి చెప్పవచ్చు. సెర్చి రిపోర్ట్‌ ఆస్తి అమ్మకందారుడు నిజమైన యజమా ని అని సర్టిఫై చేస్తే ఇక కొనుగోలుకు ఎలాంటి అడ్డంకులు లేనట్టే. 


ref:

http://vvvsrihari.wordpress.com/2010/08/
http://www.vaartha.com/content/3953/before-land-purchage-search-report.html
http://www.eenadu.net/sthiramain.asp?qry=1706sthira5

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి